గుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక సందడి
బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్న పూర్వ విద్యార్థులు
గురువులకు ఘన సన్మానం.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పెబ్బేరు, జూన్ 7(జానం న్యూస్): తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, గుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1974–1990 మధ్య పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. బూజల సోమమ్మ–రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ కన్వీనర్ బూజల భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ బాల్య, విద్యార్థి దశ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. గురువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందారు. తమ జీవితాల్లో గురువుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు.

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర క్షణాలు, సహచరులతో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అప్పటి తరగతి గదులు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల బోధన విధానాలు వంటి అనేక జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 350 మంది పూర్వ విద్యార్థులు గుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ పాత అనుబంధాలను మరింత బలపరిచారు.

ఈ కార్యక్రమంలో బూజల సోమమ్మ–రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ కమిటీ సభ్యులు బి. ఖగేందర్ రెడ్డి, పి. గోవింద్ రెడ్డి, ఎల్. రవికుమార్ రెడ్డి, టి.జి. శ్రీకాంత్, బి. హరికుమారి రెడ్డి, జి. వెంకటరామి రెడ్డి, బి. మితున్ రెడ్డి, జె. దశరథం, నిరంజన్ రెడ్డి, బూజల భారతి రెడ్డి, ఉపాధ్యాయులు దివాకారావు, రాజ గౌడ్, స్వామిరెడ్డి, జి.పుల్లారెడ్డి, వెంకటేశ్వరావు, సూర్యనారాయణ, వెంకటశెట్టి, ఎల్లారెడ్డి, విద్యార్థులు, పి. గోవిందురెడ్డి, ఎల్. రవికు మారరెడ్డి, జి. బాలయ్య, మన్నెం, మాధవరెడ్డి, నరోత్తం రెడ్డి, విజ యభాస్కరెడ్డి, హేమసుందరెడ్డి, రాణి, అనిత, సుజాత, సునీత, సుశీల, శైలజ, అనురాధ, సుధాకరావు, ఆదిత్య, గ్రామ పెద్దలు, ఉమామహేశ్వరెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగి, పూర్వ విద్యార్థులందరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

