Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అన్నమయ్య జిల్లా,
కె.వి.పల్లి మండలం, గోరంట్లపల్లి పంచాయతీ, కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు

కె.వి.పల్లి, ఏప్రిల్ 14( జానం న్యూస్): అన్నమయ్య జిల్లా,
కె.వి.పల్లి మండలం, గోరంట్లపల్లి పంచాయతీ, కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఏ.పీ.జి.వై.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ఈ రోజుల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. “అంబేద్కర్ గారి త్యాగాలు, ఆయన బౌద్ధిక పోరాటం వల్లే మేము నేడు సమానత్వాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో మన స్థానాన్ని ఏర్పరుచుకోవాలి” అని అన్నారు.ఆయన ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి, “మీరు చదువుకోవాలి, ఉద్యమించాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. సమాజంలో ఎదగాలంటే మనం సమష్టిగా ఆలోచించి ముందుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు.

సంఘ గౌరవ అధ్యక్షులు జానం గంగిరెడ్డి మాట్లాడుతూ, “డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్క ఎస్సీ/ఎస్టీ వ్యక్తికి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని” అన్నారు. ఆయన ఉద్యమం వల్లే మానవ హక్కులు, స్వేచ్ఛలు ఈ దేశంలోని పౌరులందరికీ లభించాయన్నారు.
“మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మన లక్ష్యాన్ని మరిచి పోకూడదు. విద్యే మన ఆయుధం. ఆర్థికంగా ఎదగాలంటే సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి. రాజకీయాల్లో మన హక్కును వినిపించుకోవాలి” అని హితవు పలికారు.

విశ్రాంత తహసీల్దార్ ఎం.బలరాం మాట్లాడుతూ, “నాకు అధికారిగా పనిచేసిన అనుభవంలో చాలా చోట్ల డాక్టర్ అంబేద్కర్ ఆశయాల ప్రభావం ఎలా ప్రజల జీవితాలను మార్చిందో చూసాను. ఆయన లేకపోతే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండే పరిస్థితి కూడా ఉండేది కాదు” అన్నారు.
“మన బిడ్డలను ఉన్నత విద్యకు పంపాలి. ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవాలి. మనం అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని అన్నారు.

గిరిజన సీనియర్ నాయకుడు
జీవి రమణ
మాట్లాడుతూ, “గిరిజనుల అభ్యున్నతికి డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు మార్గదర్శిగా నిలుస్తాయి. సమాజంలో మానవ సమానత్వానికి ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమైనది. ఆయన చూపిన బాటలో నడవడం మన బాధ్యత” అన్నారు.”ప్రతి గిరిజన యువకుడు, యువతీ చదువులో ప్రావీణ్యం సాధించి, ఉద్యోగం సాధించాలి. మన హక్కులు మనమే రక్షించుకోగలగాలి. దీనికి మనం ఐక్యంగా నిలబడాలి” అని స్పష్టంగా సూచించారు.

పై కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకుడు కిల్లా విజయ్ కుమార్, ఉపాధ్యాయులు జానం సుజాత, పెరం రమేష్, రైల్వే విశ్రాంత ఉద్యోగి రమణయ్య, గిరిజన నాయకులు గానుగపెంట సిద్దు, నారాయణ, పులి మల్లేశ్వరి, కోట వెంకట్రామయ్య, నరసప్ప, సహదేవ్, మహేష్, గిరిజన కాలనీవాసులు  పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఘనంగా ఓరియెంటేషన్ కార్యక్రమం

Dr. Gangi Reddy Janam Chief Editor-

సైనింగ్ స్టార్‌కు ఎంపికైన రాయచోటి వైష్ణవి స్టడీ సెంటర్ విద్యార్థులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

అభ్యసనాభివృద్ధి కార్యక్రమంపై సబ్జెక్టు ఉపాధ్యాయులకు మూడవరోజు శిక్షణా కార్యక్రమం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment