Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు శ్రీ భువన విద్యాలయం విద్యార్థులకు జవహర్ నవోదయలో ప్ర‌వేశం – ‘శ్రీ భువన విద్యాలయం’కు గర్వకారణమైన ఘనత

విద్యారంగంలో మరోసారి పీలేరు పేరు గర్వంతో వినిపించించింది. ప్రముఖ విద్యా సంస్థ ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల 11వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారు. ఈ విజయం ఆ సంస్థకు మరొక మైలురాయిగా నిలిచింది.

పీలేరు, మే 26 (జానం న్యూస్): విద్యారంగంలో మరోసారి పీలేరు పేరు గర్వంతో వినిపించించింది. ప్రముఖ విద్యా సంస్థ ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల 11వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారు. ఈ విజయం ఆ సంస్థకు మరొక మైలురాయిగా నిలిచింది.

విద్యారంగంలో మరోసారి పీలేరు పేరు గర్వంతో వినిపించించింది. ప్రముఖ విద్యా సంస్థ ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయాల 11వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారు. ఈ విజయం ఆ సంస్థకు మరొక మైలురాయిగా నిలిచింది.

2025–26 విద్యా సంవత్సరానికిగాను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన జవహర్ నవోదయ 11వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల మొత్తంగా 27 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో పీలేరు ‘శ్రీ భువన విద్యాలయం’కు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపిక కావడం ప్రత్యేకమైన గౌరవంగా మారింది.

ఎంపికైన విద్యార్థులు:

వై. జగన్మోహన్ రెడ్డి

ఎస్. సుశాంత్

ఎ. ప్రశాంత్

ఎ. లోకేష్

విద్యార్థుల ఎంపికపై స్పందించిన విద్యాలయ కరస్పాండెంట్ శ్రీమతి ఉమా రమాదేవి గారు మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి గుణలక్ష్మి , “మా విద్యార్థులు జవహర్ నవోదయ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ప్రవేశం సాధించడం గర్వకారణం. ఇది వారి కృషి, మా ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారానికి నిదర్శనం,” అని తెలిపారు.

విజయం సాధించిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఈ విజయం మా గురువుల మార్గదర్శనం, తల్లిదండ్రుల మద్దతు వల్ల సాధ్యమైంది. భవిష్యత్‌లో పోటీ పరీక్షల్లోనూ విశిష్టత సాధించేలా కృషి చేస్తాం,” అన్నారు.

ఈ సందర్భంగా శ్రీ భువన  విద్యాలయంలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించగా, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ఘనంగా అభినందించింది. విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా గుర్తించి, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ విజయం విద్యార్థులకు గమనార్హమైన ఆత్మవిశ్వాసాన్ని అందించడమే కాక, పీలేరు ప్రాంత విద్యా ప్రమాణాలను మరింతగా ఋజువు చేస్తోంది.

Socal Share

Related posts

పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాల్మీకిపురం పశువైద్యశాల ఏడి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఘనంగా డీసీఎంఎస్ చైర్మన్  సహదేవ రెడ్డి జన్మదిన వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment