Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పీలేరు నియోజకవర్గం అభివృద్ధి; ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డి

కలికిరి ఆగస్టు 18(జానం న్యూస్): కలికిరిలో పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల సమావేశం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఎం.ఎం ఫంక్షన్ హాల్ లో జరిగింది.

పై కార్యక్రమం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎస్.రెడ్డీ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించబడింది.

పై కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ రాజ్యసభ సభ్యులు మరియు ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. గత దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలే అత్యధిక సార్లు గెలుపొందారని చెప్పారు.
ఇంతవరకు జరిగిన 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుసార్లు గెలిచారని, తెలుగుదేశం అభ్యర్థులు మూడుసార్లు, వైయస్ఆర్సీపీ అభ్యర్థులు రెండుసార్లు, కృషిలోక్ పార్టీ అభ్యర్థులు రెండుసార్లు, సిపిఐ అభ్యర్థి ఒకసారి గెలిచారని ఉన్నారు. పీలేరు నియోజకవర్గం అత్యధికంగా అభివృద్ధి చెందింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీలేరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులందరూ సమన్వయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్.రెడ్డీ సాహెబ్, నియోజకవర్గ కన్వీనర్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కలిగిరి మండల పార్టీ అధ్యక్షులు రహంతుల్లా, మహబూబ్ బాషా, ఎన్ ఎస్ యు నాయకులు పాల్గొన్నారు. 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పీలేరు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

Dr. Gangi Reddy Janam Chief Editor-

రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ విజేత టి.హోత్రి శ్రీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

అన్నమయ్య జిల్లా విద్యా  శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యు.శివ ప్రకాష్ రెడ్డి.

Jaanam News

Leave a Comment