పునాది అభ్యసనంతోనే ప్రాథమిక విద్య బలోపేతం:
అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి యు.శివ ప్రకాష్ రెడ్డి
రాయచోటి, జూన్ 7: ప్రాథమిక విద్యలో పునాది అభ్యసనానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, తెలుగు, గణితంలో పునాది అభ్యసనంతోనే ప్రాథమిక విద్య బలోపేతం అవుతుందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి యు.శివప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.రాయచోటి డైట్ కళాశాలలో గురువారం, శుక్రవారం జరిగిన రెండు రోజులు డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ (డి.ఆర్.పి) లకు ఏజ్ అప్రాప్రియట్ అసెస్మెంట్ టూల్ మీద శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే దానికి ఎఫ్.ఎల్.ఎన్ పై ఈ అసెస్మెంట్ టూల్స్ పనికొస్తాయని తెలియజేశారు. చిన్నపిల్లల పెరుగుదలలో పరిసరాల ప్రభావము ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు ప్రాథమిక విద్యను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా గతేడాది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి(అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం లో పునాది) 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా డీఆర్పీలకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరిగి జిల్లాలోఎంపిక కాబడిన 90 మంది డీఆర్పీలకు రెండు రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు తెలిపారు.రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.శిక్షణ పొందిన డీఆర్పీలు తిరిగి మండల స్థాయిలో రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్ణయించిన తేదీల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి రోజు స్టేట్ అబ్జర్వర్ గా గిరిబాబు యాదవ్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది.కీ రిసోర్స్ పర్సన్స్ (కే.ఆర్.పి)లుగా ఉపేంద్ర కుమార్, శ్యామల దేవి, మరియు డైట్ లెక్చరర్ రెడ్డయ్య వ్యవహరించారు. శిక్షణ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి రెండు రోజుల నుంచి అక్కడే ఉండి అన్ని వసతులు కల్పించారు.సమగ్ర శిక్ష అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జి.సమీవుల్లా ఖాన్, మండల విద్యాశాఖ అధికారులు పి.నాగరాజు మరియు ఆంజనేయులు కోర్స్ ఇన్చార్జిగా వ్యవహరించారు. డైట్ లెక్చర్లు శివ భాస్కర్, పిఎస్ఎండి అసదుల్లా మరియు నాగరాజు పాల్గొన్నారు.ఇది 60 రోజుల జ్ఞాన ప్రకాష్ సర్టిఫికెట్ కోర్స్ కు సంబంధించింది.90 మంది డి.ఆర్.పి లకు గాను 82 మంది మాత్రమే హాజరయ్యారు.



