Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్విద్య/ఉద్యోగాలు

విద్యార్థుల విజయాలలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం: VSN సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత్రి V.మాధవి

విద్యార్థుల విజయాలలో పాఠశాల యాజమాన్యం, సిబ్బందితోపాటు తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని విఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి అన్నారు. మంగళవారం స్థానిక తిరుపతి రోడ్డులోని వి.ఎస్.ఎన్ టెక్నో స్కూల్ నందు పదవ తరగతి ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ

జానం న్యూస్, పీలేరు, ఏప్రిల్ 23: విద్యార్థుల విజయాలలో పాఠశాల యాజమాన్యం, సిబ్బందితోపాటు తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని VSN విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి అన్నారు. మంగళవారం స్థానిక తిరుపతి రోడ్డులోని VSN సిద్ధార్థ టెక్నో స్కూల్ నందు పదవ తరగతి ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల నాణ్యమైన విద్య, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషి వల్ల పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించామని వారిని కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు వారి పైన పర్యవేక్షణ ఉండాలని, మొబైల్ ఫోన్స్ కు బానిస కాకుండా చూడాలని అన్నారు. అందుకే తాము 5 గంటల నుండి 9 గంటల వరకు విద్యార్థులను తమ ఆధీనంలో ఉంచుకొని చదివించుట జరుగుతుందని అన్నారు. బిఎస్ఎన్ సిద్ధార్థ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతుందని కొన్ని వేల మంది విద్యార్థులు తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలలో ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో వేలాదిమంది పనిచేస్తూ అత్యధిక వేతనం పొందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను మరియు 594,592,591 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి  ర్యాంకు లు సాధించిన వై.గీతిక,S.Md సమీద్,S.Md షహీద్ లను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన వై.గీతి, ఎస్.ఎం.డి సమీద్ లు మాట్లాడుతూ తమ విజయానికి కారణం వి.ఎస్.ఎన్ సిద్ధార్థ యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అని వారికి కృతజ్ఞతలు తెలిపారు. పై కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్, అకడమిక్ ఇంచార్జ్ బాబు రెడ్డి, టెక్నో స్కూల్ ఇంచార్జ్ సాయి, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, రెడ్డి ప్రసాద్, కిరణ్, గోవింద్, తెలుగు ఉపాధ్యాయులు చలపతి నాయుడు, చిరంజీవి, హిందీ ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం, మహబూబ్ బాషా, వెంకటా చలపతి, గణితం ఉపాధ్యాయులు త్రివిక్రమ్, సురేంద్ర, సిద్దు, భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు రమేష్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు, బాలాజీ, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు జనార్ధన రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

సుమతీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వి స్టేజ్ క్రియాశీలక సభ్యులు 

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరులో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం

Dr. Gangi Reddy Janam Chief Editor-

గుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక సందడి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment