Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి.

జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 26; మంగళవారం స్థానిక కడప రోడ్డులో గల సంధ్య ప్రధమ చికిత్చాలయంలో స్థానిక బలిజ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి, టెంకాయ కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, పీలేరు మానవతా సంస్థ చైర్మన్, బలిజ సంఘం నాయకులు వంగిమల్ల రామచంద్ర,జనసేన పార్టీ నాయకులు కలప రవి, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోకల తాతయ్య,న్యాయవాది చంద్రశేఖర్, రామిశెట్టి మనోహర్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా చనిపోయినా కూడా పేద ప్రజల గుండెల్లో జీవించి ఉన్నాడని అన్నారు. రంగా పేదల పాలిట పెన్నిధి, ఆశాజ్యోతి, యువతకు స్ఫూర్తి, బలిజలకు దశా నిర్దేశం చేసిన ప్రేరణకర్త. నవ సమాజ నిర్మాణానికి సమ సమాజ భవితవ్యాన్ని కి వారి యొక్క సేవలు , కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సమాజం కోసం పాటుపడాలని అన్నారు.  రంగా  జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని బలిజలకు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలవడం, అటువంటి సేవా తత్పర్థ కలిగి సమాజం కు ఉపయోగపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం పీలేరు సభ్యులు లక్ష్మీకర్, శివ రాయల్,  మల్లికార్జున స్టూడియో గురుమూర్తి, , అండే సురేష్ బాబు, మెడికల్ షాప్ సుబ్బయ్య, హరీష్ , వీ.జే .జగన్మోహన్,  నవీన్, డాక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

విద్యార్థులకు ప్రోత్సాహంగా క్రికెట్ కిట్, విద్యా సామగ్రి పంపిణీ జానం సుజాత సేవా కార్యక్రమం ఆదర్శం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment