జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 21:: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండురోజులు జరిగిన రీజినల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2023(బాలికలు) పోటీలు ముగిసాయి. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడ సింగల్స్ మరియు డబుల్స్ లో పీలేరు కి చెందిన జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు కోచ్ టి.ప్రభాకర్ రెడ్డి కుమార్తె మరియు జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టీ.హోత్రిశ్రీ అంగల్లు గోల్డెన్ వ్యాలీ పాలిటెక్నిక్ తరఫున ఆడి విజేతగా నిలిచింది. పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ డీన్ యస్.విజయ భాస్కర్ రావు చేతుల మీదుగా కప్ మరియు సర్టిఫికెట్ అందజేశారు. హోత్రిశ్రీ జనవరి 4, 5వ తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా హోత్రిశ్రీ ని బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారులు రాచపల్లి రాజగోపాల్ రెడ్డి(విశ్రాంత ప్రధానోపాధ్యాయులు), పట్టణ ప్రముఖులు రేఖరాణి స్వరాజ్ రెడ్డి దంపతులు, హోత్రిశ్రీ అకాడమీ సభ్యులు హనీఫ్, గోవర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రెడ్డి శేఖర రెడ్డి, రెడ్డివారధి,పట్టణంలోని లోని ప్రముఖులు అభినందించారు.


