జానం న్యూస్, కెవి పల్లి, డిసెంబర్ 20: కె.వి పల్లి మండలం జడ్పిటిసి గజ్జల శృతి రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ముద్రింపబడిన నూతన సంవత్సర క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదుగా తిరుపతిలోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జడ్పీటిసి గజ్జల శృతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ముద్రించి వైఎస్ఆర్సిపి కి విసృత ప్రచారం చేస్తున్నారని అభినందించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి కృషి చేయాలని సూచించారు. పై కార్యక్రమంలో జడ్పిటిసి గజ్జల శృతి రెడ్డి తోపాటు కె.వి పల్లి మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు వెంకటరమణ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


