Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వైఎస్సార్సీపీ ఎస్టి సెల్ మండల కన్వీనర్ గా ఎం.మునీంద్ర @ కాలనీ చిన్న నియామకం.

జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 19 : వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ మండల కన్వీనర్ గా ఎం.మునీంద్ర @ కాలనీ చిన్న నియమితులయ్యారు. వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుండి కాలనీ చిన్న పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి గత 30 సంవత్సరాలుగా విధేయుడుగా ఉంటున్నారు. ప్రస్తుత పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఎస్టీ సెల్ మండల కన్వీనర్ గా ఉన్న ఆయనకు రెండో సారి అదే పదవి అప్పగించారు. ఈ సందర్భంగా ఎం.మునీంద్ర అలియాస్ కాలనీ చిన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి ఎస్టీ సెల్ కన్వీనర్ పదవి అప్పగించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ పదవి తనకు వరించుటలో సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఏపీఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి  విజయానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

Students should grow as scientists: Piler MEOs are Lokeshwar Reddy and Padmavathi.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Major Red Sanders Smuggling Bid Foiled in Tirupati; Contraband Worth ₹16 Lakh Seized

ఆంగ్లేయుల గుండెల్లో సింహ స్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment