Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ప్రతి విద్యార్థి లోని కళల ను వెలికి తీయడంతోపాటు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: పి.బి శోభ ప్రకాష్, ప్రిన్సిపల్ ఏవిఆర్ స్కూల్,పీలేరు.

జానం న్యూస్, పీలేరు, నవంబర్ 27: ప్రతి విద్యార్థి లో నిగూఢంగా దాగి ఉన్న కళ ను వెలికి తీసి ప్రోత్సహించదాంతోపాటు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని సోమవారం ఉదయం స్థానిక ఏ.వి.ఆర్ పాఠశాల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  పాఠశాల ప్రిన్సిపాల్ పి.బి శోభా ప్రకాష్ అన్నారు. చదువుతోపాటు మిగిలిన కరికులం అంశాలైన యోగా, కరాటే, నాట్యం, సెమినార్, వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించి వారిలో దాగివున్న కళలను గుర్తించి అందులో రాణించేటట్లు చేస్తామని అన్నారు. ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు.పీలేరు పట్టణంలో ఏ ప్రైవేట్ స్కూల్లో లేని అటల్ టింకరింగ్(ఏ.టి.ఎన్) లాబ్ తమ ఏ.వి.ఆర్ పాఠశాలలో ఉందని అన్నారు. ఈ ఏ.టి.ఎన్ లాబ్ ద్వారా విద్యార్థులలోని ఉత్సుకత, సృజనాత్మకత మరియు ఊహాశక్తిని పెంపొందించడం మరియు డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందని అన్నారు. తద్వారా తమ విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు చేసి ఉత్తమ అవార్డులు కూడా పొందడం తమకు గర్వంగా ఉందని అన్నారు. ఏ.వి.ఆర్ పాఠశాల అత్యుత్తమ బోధనా సిబ్బంది కలిగి, అద్భుతమైన పర్యావరణంలోవిశాలమైన తరగతి గదులు, ప్రతి విద్యార్థికి మినరల్ వాటర్ లభ్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు కలిగి ఉన్నాయని అన్నారు.ప్రతి నెల పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించడం, ఆ సమావేశంలో విద్యార్థుల యొక్క పురోగతి వారికి తెలియజేపడం జరుగుతుందని అన్నారు. తమ పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు పాత్ర తోపాటు తల్లిదండ్రుల సహకారం కూడా సంతోషకరమని అన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు కూడా పాఠశాల ప్రిన్సిపాల్ శోభా ప్రకాష్ మరియు పాఠశాల సిబ్బంది తమ పిల్లల పురోగతి కోసం ఎంతో శ్రమ పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు .పై మీడియా సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు నరేష్ కుమార్, శిరీష, ప్రవల్లిక, యాస్మిన్, ప్రత్యూష, దివ్య భారతి తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు జాగ్రత్తలు పాటించాలి

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు లో ఏర్పాటు చేసే టపాసులు దుకాణాల స్థలాన్ని  పరిశీలించిన అధికారులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రధానోపాధ్యాయులు వి.జి. నటరాజన్

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment