Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు శాఖ IMA నియామక పత్రాన్ని అందుకున్న నూతన కమిటీ సభ్యులు.

పీలేరు, సెప్టెంబర్ 17(జానం న్యూస్): స్థానిక బి.కే.ఆర్ రెసిడెన్సీలో IMA పీలేరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. పై కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ పి.ఫణిధర్ నియామక పత్రాన్ని కమిటీ సభ్యులకు అందజేసారు. గత నెలలో పీలేరు బ్రాంచ్ ఐఎంఏ కమిటీ ఏర్పడిన విషయం పాఠకులకు విధితమే.పీలేరు శాఖ అధ్యక్షుడిగా Dr. పి.చంద్రశేఖర్, కార్యదర్శిగా డాక్టర్ పవన్ కుమార్ మరియు కోశాధికారిగా డాక్టర్ బి.ఈశ్వర్ సురేంద్ర, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రూపేష్ కుమార్ రెడ్డి, Dr ఎల్లయ్య, సంయుక్త కార్యదర్శులుగా Dr.మమత లక్ష్మి, Dr.శశి భూషణ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా Dr.రూపానంద్, Dr.రామాంజి, Dr.భారతి, Dr.మాధవి, Dr.షాహుఆలి, Dr.శ్రీలత, Dr.కోటేశ్వరమ్మ, Dr.నాగావేణి నియమితులయ్యారు. నియామక పత్రం అందుకున్న సందర్భంగా పీలేరు బ్రాంచ్ ఐఎంఏ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నూతన పదవులతో తమ బాధ్యత మరింత పెరిగిందని డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్యులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షితమైన, ఉచిత, శాంతియుత వాతావరణంలో వైద్యులు వైద్యసేవలు అందించేలా చూడాలని, వైద్యులపై కేసులు నమోదు చేసేందుకు నిర్దిష్ట నిబంధనలు ఉండాలని, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఎప్పుడుఆసుపత్రుల్లో రోగుల మరణాలు మరియు చికిత్సలో లోపాలు సంభవించినప్పుడు వైద్యులపై వైద్యపరమైన నిర్లక్ష్యం కేసులను నమోదు చేయడంపై ముగ్గురు వైద్య నిపుణుల కమిటీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Socal Share

Related posts

లంకను దాటించిన ప్రేమ

Jaanam News

పీలేరు డి.ఎఫ్.ఓ సంచారదళ నిఘా విభాగం ఆధ్వర్యంలో  రూ.17 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు, వాహనం స్వాధీనం,

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజన యానాది నాయకుడు పులి శ్రీనివాసులు కు ఘన సన్మానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment