Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఘనంగా భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు

జానం న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 4: తిరుపతి ఆర్.పి.ఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు ఆదివారం భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఏడవ వార్షికోత్సవం వేడుకలు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ ఉమెన్ శ్రీమతి సుమతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పై కార్యక్రమంలో కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి(సత్యా రెడ్డి), లాయర్ రాంప్రసాద్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ అధినేత్రి సుమతీ రెడ్డి కులరహితంగా సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. రెడ్డి కులంలో పుట్టిన మణి రత్నం శ్రీమతి సుమతి రెడ్డి అని అన్నారు. ఆమెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఆమె రెడ్డి సంక్షేమ సంఘానికి చేస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమతీ రెడ్డి ని దుశ్యాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  పై కార్యక్రమంలో చింతపర్తి జగన్నాథరెడ్డి, జనార్దన్ రెడ్డి, రామిరెడ్డి, శేష కుమార్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, తాతిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జయ చంద్రారెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, రాజారెడ్డి, సహదేవరెడ్డి, రామిరెడ్డి,ఎన్.సత్యనారాయణరెడ్డి, హరి కుమార్ రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలికిరి తనని హోటల్ దగ్గర భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలకు బయలుదేరిన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు

Socal Share

Related posts

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజన యానాది నాయకుడు పులి శ్రీనివాసులు కు ఘన సన్మానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు హెరిటేజ్ ఫుడ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు111 మంది మహిళా పాల సేకరణ ప్రతినిధులకు సన్మానం – మహిళా సాధికారతకు హెరిటేజ్ కట్టుబాటు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఎంపీ నిధులతో దివ్యాంగుడికి త్రిచక్ర స్కూటీ పంపిణీ – రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతుల మీదుగా అందజేత

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment