Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పీలేరు జనసేన పార్టీలో భారీగా చేరికలు, పట్టణం పురవీధుల్లో యువత బైక్ ర్యాలీ

జానం న్యూస్, పీలేరు, జనవరి 21:జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ అన్నారు. ఆదివారం స్థానిక మండలంలోని మొరవవడ్డీపల్లి, శ్రీవారి కల్యాణ మండపంలో కామిశెట్టి సుధాకర్, జిల్లా కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ  మండల అధ్యక్షుడు మోహన కృష్ణ అధ్యక్షతన నియోజకవర్గం స్థాయిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం పాత పథకాలను అమలు చేస్తూ జగనన్న పేరు జోడిస్తున్నారని అన్నారు.ప్రస్తుత వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని  దాన్ని ఓట్ల రూపంలో రాబట్టాలని అన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులందరూ గెలిచే విధంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందురు టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థులకే ఓట్లు వేస్తారని అన్నారు.జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కామిశెట్టి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో జనసేన పార్టీ ఆశయాలను నింపాలని ప్రతి కుటుంబం నుండి జనసేన,టిడిపి కి ఓట్లు పడే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ అనంతరం పలువురు యువత జనసేన పార్టీలో చేరడం అయినది.ముందుగా  జనసేన పార్టీ యువత  భారీ ఎత్తున పట్టణ పుర వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు సురేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు గజేంద్ర, దనశేఖర్, మండల ఉపాధ్యక్షులు గురు మోహన కృష్ణ,గజేంద్ర, ధనశేఖర్, కార్య దర్శి విగ్నేష్, నియోజకవర్గ కాపు యువత అధ్యక్షులు సురేష్ బాబు, కాపు సంక్షేమ సంఘం మోకాటి సుబ్బయ్య, నరేష్, పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి యువత, వీర మహిళలు బారి ఎత్తున పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కలపరవి
సభకు నమస్కరిస్తున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ
సమావేశంలో ప్రసంగిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్, ప్రక్కనే సభకు నమస్కరిస్తున్న కామిశెట్టి సుధాకర్
Socal Share

Related posts

పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రజల ఆరాధ్య దైవం రాజంపేట ఎంపీ మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి:ఎంపి పిఆర్ఓ ఉదయకుమార్

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం మీ జీవితాన్ని మారుస్తుంది: మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment