Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

చింతలబైలు గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు, దుప్పట్లు పంపిణీ

జానం న్యూస్, పీలేరు, జనవరి 16: స్థానిక మండలం, చింతలబైలు గిరిజన కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు గిరిజన యానాదులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పై సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం  యానాది బ్రతుకుల్లో వెలుగు నింపడానికి తన వంతు కృషి చేస్తుందని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ  గిరిజన యానాది బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ప్రభుత్వ పథకాలకు కూడా అందనంత దూరంలో వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన యానాది కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడమైనది. అందులో భాగంగా గిరిజన కాలనీ వాసులకు ఆటల పోటీలు నిర్వహించడమైనది. అనంతరం గిరిజన యానాది నాయకుల చేతులమీదుగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 30 గిరిజన యానాది కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని. పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక మహిళా అధ్యక్షురాలు సావిత్రమ్మ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు మీడియా సమన్వయకర్త జానం గంగిరెడ్డి,జానం సుజాత, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమలశెట్టి రమణ, సుశీల దంపతులు, గానుగపెంట జయచంద్ర, పులి మల్లేశ్వరి, తిరుపతి బర్డ్ హాస్పిటల్ టెక్నీషియన్ ఎస్.నాగరాజు, గడ్డం రవి, మహేష్, కల్లూరి విశ్వనాథ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

లంకను దాటించిన ప్రేమ

Jaanam News

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజన యానాది నాయకుడు పులి శ్రీనివాసులు కు ఘన సన్మానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి  ఎం.ఆనంద రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment