Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

పీలేరు డి.ఎఫ్.ఓ సంచారదళ నిఘా విభాగం ఆధ్వర్యంలో  రూ.17 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు, వాహనం స్వాధీనం,

ఏడు మంది తమిళ కూలీలు అరెస్ట్: 
రిమాండ్ కు తరలింపు.

జానం న్యూస్, పీలేరు జనవరి 8:

పీలేరు సంచారదళ విభాగం డి.ఎఫ్.ఓ, జేవీ సుబ్బారెడ్డి ఆదేశాలు మేరకు మరియు జనవరి  7వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో సంచారదళ విభాగం, పీలేరు వారికి సానిపాయ చుట్టుపక్కల ప్రదేశం నుండి కారులో ఎర్రచందనం దుంగలు చెన్నైకు అక్రమ రవాణా చేయుచున్నారని రాబడిన అత్యంత రహస్య సమాచారం మేరకు పీలేరు సంచారదల నిఘా విభాగం,అటవీ క్షేత్రాధికారి ఎన్.వెంకటరమణ తన సిబ్బందితో కలిసి పీలేరు-చిత్తూరు జాతీయ రహదారి, ఎం.జే.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కాపు కాయుచుండగా జనవరి 8వ తేదీ ఉదయం సుమారు 3 గంటలకు పిలేరు వైపు నుండి చిత్తూరు వైపు ఒక కారు అత్యంత వేగంగా రావడం గమనించి ఫారెస్ట్ సిబ్బంది ఆపుటకు ప్రయత్నించగా కారు ఆపకుండా వేగంగా పోవడంతో సిబ్బంది అప్రమత్తమై సదరు కారును వెంబడించగా కారు డ్రైవర్ అశోక్ నగర్ కాలనీ సమీపంలో కారు ఆపి డ్రైవర్ మరియు మరొక వ్యక్తి పారిపోగా తమిళనాడుకు చెందిన 7 కూలీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది. ఫోర్డ్ ఫిస్తో కారు అందులో ఉన్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని తూకం  వేయగా 17 లక్షల రూపాయలతో మతింపు వేయడమైనది. పారిపోయిన వ్యక్తులలో ఒకరు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలకు మేస్త్రిగా వ్యవహరిస్తాడని నిర్ధారణకు వచ్చారు.  పారిపోయిన డ్రైవర్ గురించి దర్యాప్తు చేస్తున్నామని త్వరలో వారిద్దరిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ దాడిలో ఎఫ్.బి.ఓ, కే.ప్రతాప్, ప్రొటెక్షన్ వాచర్లు ప్రభుతేజ, చరణ్, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజన యానాది నాయకుడు పులి శ్రీనివాసులు కు ఘన సన్మానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్లు ఆవిష్కరణ.

Dr. Gangi Reddy Janam Chief Editor-

విద్యార్థుల విజయాలలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం: VSN సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత్రి V.మాధవి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment