Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ పొదుపు.. భవితకు భరోసా!:APSPDCL, AE (పట్టణ) పురుషోత్తం.

జానం న్యూస్,  పీలేరు, డిసెంబర్‌ 17:విద్యుత్‌ పొదుపు.. భవితకు భరోసా! అని పీలేరు పట్టణ APSPDC, అసిస్టెంట్ ఇంజనీర్(పట్టణ) పురుషోత్తం అన్నారు.ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ సంస్థ  ఈ నెల 14 నుంచి 21 వరకు విద్యుత్‌ పొదుపు వారోత్సవాల సందర్భంగా పీలేరు పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్(పట్టణ) పురుషోత్తం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి తిరుపతి రోడ్డులోని APSPDCL డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చిరంజీవి బుర్రకథ నాట్యమండలి వారిచే విద్యుత్ పొదుపు పై పాటలు పాడి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏ.ఈ పురుషోత్తం మాట్లాడుతూ విద్యుత్‌ను అనవసరంగా ఖర్చు చేయవద్దని, గదుల్లో సహజ సిద్ధంగా వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలని, అన్ని కిటీకిలు తెరిచి ఉంచాలని, అన్ని కేటగిరీలకు చెందిన వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు.అవసరానికి మాత్రమే విద్యుత్‌ను ఉపయోగించాలి. గదులలో వ్యక్తులు లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆర్పివేయాలి. ఎల్‌ఈడీ బల్బులు మాత్రమే వాడాలి. 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న విద్యుత్‌ పరికరాలు వాడాలి. ఫ్రిడ్జ్‌ డోర్‌ను తెరిచి ఉంచరాదు. అవసరమైనప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచి, తిరిగి వెంటనే మూసి ఉంచినట్లయితే విద్యుత్‌ ఆదా అవుతుంది. ఇండ్లలో నీటిని వేడి చేయడానికి ఇమ్మర్షన్‌ వాటర్‌ హీటర్లు వాడొద్దు. వాటి ద్వారా బిల్లు అధికంగా వస్తుంది. సొలార్‌ పవర్‌ ప్లేట్లను, బిల్డింగ్‌ పైన ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసుకుని సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుని సొలార్‌ నెట్‌ మీటర్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులు తగ్గించుకోవచ్చు.
విద్యుత్‌ పొదుపు కోసం ఎల్‌ఇడీ బల్బులు, ట్యూబ్‌లు తప్పనిసరిగా వాడాలి. ఫోకస్‌లైట్లు, హాలోజన్‌ బల్బులు అధిక విద్యుత్‌ను వినియోగిస్తాయి. కావున తప్పని సరిగా ఎల్‌ఇడీ బల్బులు మాత్రమే వాడాలి. అన్ని కార్యాలయాల్లో కూడా అవసరానికి తగినట్లుగా లైట్లు, ఫ్యాన్లు వాడాలి. అవసరం లేనప్పుడు పరికరాలు, స్విచ్‌లు, లైట్లు, ఆఫ్‌ చేయాలి. సిబ్బంది అందరూ విద్యుత్‌ దుబారాను ఆరికట్టాలి.
అన్ని రకాల మోటార్లకు తప్పని సరిగా కెసాసిటర్‌లు వాడినట్లయితే విద్యుత్‌ పొదుపు చేయవచ్చు. కరెంట్‌ బిల్లులు తగ్గించవచ్చు. అన్ని ప్రదేశాల్లో ఎల్‌ఈడీ బల్బులు మాత్రమే వాడాలి. హోలోజన్‌ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు వాడి విద్యుత్‌ పొదుపు చేయాలి. సహజ సిద్దంగా వెలుతురు వచ్చేట్లుగా షెడ్‌పై భాగంలో గ్లాస్‌టాప్‌లు ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలన్నీ తెరిచి ఉంచాలి.అన్ని రకాల విద్యుత్‌ మోటార్లకు తప్పని సరిగా అవసరమైన కెపాసిటర్లు ఏర్పాటు చేసుకుంటే మోటార్లు, స్టార్టర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే దగ్గరలో ట్రాన్స్‌ఫార్మర్లు, సంబంధిత విద్యుత్‌ లైన్‌లపై భారం పడకుండా కాపాడవచ్చు. విద్యుత్‌తో పాటు నీటి దుబారాను ఆరికట్టడానికి ఆటోస్టార్టర్లను తప్పని సరిగా తొలగించాలి. పై సూచలన్నింటిని పాటించి, విద్యుత్‌ను పొదుపు చేయాలని చెప్పారు.పై కార్యక్రమంలో ఏఈ పురుషోత్తం తోపాటు లైన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, లైన్ మ్యాన్ లు శ్రీరాములు, భాస్కర్, గంగయ్య, మధు, సిబ్బంది, కళాకారులు చిరంజీవి, వరప్రసాద్, రమణబాబు పాల్గొన్నారు.

Socal Share

Related posts

పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి  ఎం.ఆనంద రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

మసీదులు, దర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి- జిల్లా waqf board ఛైర్మన్ SA కరీముల్లా.

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిత్తూరులో ‘బాల్య వివాహ విముక్తి వ్రతం’ ప్రారంభం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment