జానం న్యూస్, వాల్మీకి పురం, నవంబర్ 16: స్థానిక జి.వి.ఎస్.సి.ఎస్ క్రికెట్ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్ అండర్ 19 బాలుర క్రికెట్ జట్లు ఎంపిక చేశామని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జయరామయ్య తెలిపారు. ఈ ఎంపిక కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి సుమారు 90 మంది బాలురు పాల్గొనగా 32మంది ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి రెండు జట్లు ప్రాబబుల్ కు ఎంపిక చేసి వారికి 3 రోజులు పోటీలు నిర్వహించి పోటీలకు పంపుతామని స్కూల్ గేమ్స్ కార్యదర్శి జయరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో *పోటీల నిర్వాహకులు శ్రీధర్, ఖాదర్ బాబా, లాల, నాగరాజు, నరేష్, రియాజ్ , సెలక్టర్ లు యోగేష్, భరత్, రెడ్డి బీసీసీఐ లెవెల్ ఏ కోచ్ సునీల్ కుమార్* తదితరులు పాల్గొన్నారు.




