Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యం:కుప్పం రవిచంద్రా రెడ్డి,నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ యజమాని.

జానం న్యూస్, పీలేరు, నవంబర్ 14: ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యం అని కుప్పం రవిచంద్ర రెడ్డి,నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ యజమాని అన్నారు.సోమవారం పీలేరు మండలంలోని ముడుపుల వేముల పంచాయితీలోని పీలేరు-కలకడ జాతీయ రహదారి పక్కన విశాలవంతమైన ప్రాంతంలో ఉన్న నందిస్ ఆక్వా వాటర్ ప్లాంట్ కు దసరా, దీపావళి  సందర్బంగా ప్లాంట్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆయుధ పూజ చేశారు.ప్లాంట్ లో పనిచేసే కార్మికులకు నూతన దుస్తులు, టపాకాయలు, స్వీట్లు బహుమతులుగా అందజేసారు.ఈ సందర్భంగా రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ కు భారత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఐఎస్ఐ మార్క్ కేటాయించడం జరిగింది ఆని అన్నారు.ఈ వాటర్ ప్లాంట్ లో దాదాపు 30 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన లైసెన్సులు లేకుండా పీలేరు పట్టణంలో వాటర్ ప్లాంట్ లను ఇంటి వద్ద ఉంచుకొని ఐఎస్ఐ మార్కు లేకుండా నాసిరకమైన నీటిని పంపిణీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించేందుకు భారత ప్రభుత్వ సంస్థ నుంచి ఐఎస్ఐ మార్కును కేటాయించుకొని, జీఎస్టీ కూడా కడుతూ ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలుకు విక్రయిస్తున్నామని తెలిపారు. తమ వద్ద అర్థ లీటరు, లీటరు నీళ్ల ప్యాకెట్లు మరియు దుకాణ సముదాయాలు శుభకార్యాలకు స్వచ్ఛమైన నీటిని అందించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు    9573385850 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. పై కార్యక్రమంలో నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ కార్మికులు,కుప్పం రవిచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులైన వారి సతీమణి సాయిరతిదేవి రెడ్డి, కుమారుడు నందిష్ రెడ్డి, కుమార్తె వేదిక రెడ్డి, బంధుమిత్రులు పాల్గొన్నారు.


Socal Share

Related posts

పీలేరు హెరిటేజ్ ఫుడ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు111 మంది మహిళా పాల సేకరణ ప్రతినిధులకు సన్మానం – మహిళా సాధికారతకు హెరిటేజ్ కట్టుబాటు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు జనసేన పార్టీలో భారీగా చేరికలు, పట్టణం పురవీధుల్లో యువత బైక్ ర్యాలీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment