Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలు

పీలేరు నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలు ప్రారంభం.

పీలేరు సెప్టెంబర్ 14(జానం న్యూస్): పీలేరు నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు పీలేరు పట్టణం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో  గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయి. మొదటి రోజు వాలీబాల్, బాల్ బ్యాట్మెంటన్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ ఆటలలో పోటీలు జరిగాయి.పై  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయి పోటీలకు సమన్వయకర్తగా వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణరెడ్డి వ్యవహరించారు. పై కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా  జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకట రెడ్డి, కోటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివ శంకరయ్య పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అధ్యక్షులు రమేష్ బాబు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మానసికొల్లాసంతొ పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని అన్నారు.
చదువుతోపాటు క్రీడలలో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ క్రీడల్లో రాణించిన జట్లను జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.పై కార్యక్రమానికి విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు చెన్నముని సహకరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సంపూర్ణమ్మ, ఉషారాణి, సహదేవనాయక్, నరేంద్ర రెడ్డి, మోహన రెడ్డి, జ్యోత్స్న, రియాజ్, ఆర్ముగం, రాణి, పోసేశ్వరయ్య, నియోజకవర్గంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, గురుకుల, ఏపీ మోడల్ స్కూల్ల నుండి సుమారు 300 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

రెడ్డి సంక్షేమ సంఘం సేవాగుణం .. గిరిజన ముంగిట: తలకోన కు వస్త్రదానం మరియు అన్నవితరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం మీ జీవితాన్ని మారుస్తుంది: మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

వేడుకగా బ్రాహ్మణ సేవా సంఘ కార్తీక వన మహోత్సవం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment