పీలేరు, సెప్టెంబర్ 2 (జానం న్యూస్): పేదల ఆరాధ్య దైవం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పీలేరులో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా జీవి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఉండేది కాదని అన్నారు. కుల, మత పార్టీలకతీతంగా ఆదుకున్న మహనీయుడు వైయస్ అని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదలను కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి దేనని కొనియాడారు.అనంతరం దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పై కార్యక్రమంలో పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబిబ్ బాషా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, మాజీ ఎంపీపీ మహిత ఆనంద్, కార్పొరేషన్ డైరెక్టర్లు నాగ రాజమ్మ, రాజేశ్వరి, మాజీ సర్పంచ్ ఏ.ఎస్ హుమయున్, కె.వి పల్లి మాజీ జడ్పిటిసి జయరామచంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునీంద్ర అలియాస్ కాలనీ చిన్న, మునీర్, వార్డు సభ్యులు ఏ.ఎస్ హబిబ్, ఆబీద్, వైయస్సార్సీపి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్ అలియాస్ చక్రి, వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

