Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

అలరించిన శ్రీ వంశీ కళాక్షేత్రం “ప్రియరాగాలు”గాన కచేరి కార్యక్రమం.

జానం న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 4: తిరుపతి లీలామహల్ సమీపంలోని వి.ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో శ్రీ వంశీ కళాక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ జి.ఎల్ కుమార్ (తిరుపతి ఎన్టీఆర్) ఆధ్వర్యంలో “ప్రియరాగాలు” పేరుతో గాన కచేరీ కార్యక్రమం ఆదివారం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త వై.ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ జి.ఎల్ కుమార్ శ్రీ వంశీ కళాక్షేత్రం పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరుగు పడిపోతున్న మన సంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, ప్రతి ఏడాది తెలుగు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ తెలుగు పద్య నాటకాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సామాజికవేత్త మరియు గాయకుడు బండి ఈశ్వర్ మాట్లాడుతూ వై.ప్రవీణ్ కుమార్ సామాజిక సేవ చేయడంలో ముందు ఉంటారని, నర్సింగ్ విద్యాసంస్థలు స్థాపించి పేదలకు ఉచిత విద్య కూడా అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం వై.ప్రవీణ్ కుమార్ కు దుశ్శాలవా కప్పి ఘనంగా సన్మానించారు. రాజకోట రహస్యం చిత్రంలోని ఘంటసాల,పి.సుశీల పాడిన పాట “నెల వంక తొంగి చూసింది” శ్రీ ప్రియ, బండి ఈశ్వర్ కలిసి పాడిన ఆ పాట అందరిని అలరించింది. పాటల కచేరి అనంతరం గాయనీ గాయకులకు మూమెంటోలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు బహుకరించారు.పై కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గాయని గాయకులు హాజరై ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన పాటలను తమ గాత్రం ద్వారా గానామృతాన్ని అందించారు.పై కార్యక్రమంలో గాయనీ గాయకులు శ్రీ ప్రియ, బండి ఈశ్వర్ కె.మనోహర్, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, నీలం రోశయ్య, పెంచలయ్య, రామకృష్ణ, జి.లక్ష్మి,విజయ్, రమ, కే.రఘు, సతీష్ రెడ్డి, వాహిని, మణిచంద్ర, లీలావతి, సురేష్, కల్పన, ముద్దు కృష్ణ, శ్యామల, రత్న, స్థానిక కళాకారులు పాల్గొన్నారు.

రాజకోట రహస్యం చిత్రంలోని “నెలవంక తొంగి చూసింది” పాటను పాడుతున్న గాయని శ్రీ ప్రియ గాయకుడు బండి ఈశ్వర్

Socal Share

Related posts

పీలేరు శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా “హిందీ దివస్/జాతీయ హిందీ భాష దినోత్సవం” వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

సైనిక్ స్కూల్ & ఇన్‌స్పైర్ మనక్ అవార్డ్స్‌లో ఏ.వి.ఆర్ విద్యార్థుల సత్తా

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment