Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయం

పైలట్ నుండి పవర్ ఫుల్ లీడర్, తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఎదిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: మొర్రంరెడ్డి రామ్ కుమార్ రెడ్డి.

జానం న్యూస్, వాయల్పాడు, డిసెంబర్ 7: పైలట్ నుండి పవర్ ఫుల్ లీడర్, తెలంగాణ రాష్ట్ర హోం మినిస్టర్ గా ఎదిగిన నాయకుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మొర్రంరెడ్డి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, వాయల్పాడు పట్టణంలోని మొదటి సినిమా ధియేటర్ సీతారాం టాకీస్ అధినేత మొర్రం రెడ్డి కుమార్ రెడ్డి కుమారుడు, పట్టణ ప్రముఖులు మొర్రం రెడ్డి రామ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పాత మిత్రుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మొర్రం రెడ్డి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ కుమార్ రెడ్డితో తనకు మంచి మిత్రుడని అన్నారు. ఇంకా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట మొదట భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత 1987-92 వరకు భారత రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ కు ఏ.డి.సి గా సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు.అప్పుడు తాను న్యూ ఢిల్లీ ఆంధ్ర భవన్ లో క్యాటరింగ్ మేనేజర్ గా పని చేస్తున్నప్పుడు తనకు ఉత్తమకుమార్ రెడ్డితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రిగా ఎన్నికైన సందర్భంగా భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన వారిలో మొర్రం రెడ్డి రామ్ కుమార్ రెడ్డి తో పాటు రాయచోటి నియోజకవర్గ, మాధవరం మాజీ సర్పంచ్ సైకం నాగిరెడ్డి కూడా ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం మీ జీవితాన్ని మారుస్తుంది: మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

దూదేకుల ముస్లిం లకు రాజకీయ అవకాశం కల్పించండి:-రాష్ట్ర “నూర్ బాష ” యూత్ ప్రధాన కార్యదర్శి ఫజులుల్లా

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment