మసీదులు, దర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి- జిల్లా waqf board ఛైర్మన్ SA కరీముల్లా.
గుర్రంకొండ, ఆగస్టు 16(జాననం న్యూస్): పీలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మసీదులు, దర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అన్నమయ్య జిల్లా waqf board చైర్మన్ SA కరీముల్లా పేర్కొన్నారు. బుధవారం ఆయన గుర్రంకొండలోని ప్రముఖ షంషీర్ ఖాన్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చాదర్ సమర్పించారు. అనంతరం అక్కడి ముస్లింలతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా waqf board ఛైర్మన్ SA కరీముల్లా మాట్లాడుతూ కొన్ని మసీదులకు సంబంధించి ఇమామ్, మౌజంల వేతనాల సమస్యను ప్రస్తావించారని అన్నారు. పై సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి భరోసానిచ్చారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఆధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జామియా మసీదు ముత్తవల్లి డాక్టర్ జలీల్, దర్గా ముత్తవల్లి గౌస్ బాషా మరియు బావాజాన్ ,అన్సర్ తదితరులు పాల్గొన్నారు.

