Jaanamnews.in | Telugu News Channel News App
సినిమా వార్తలు

గన్నవరం హీరో… కాస్ట్ లీ కోరికలు ట్రైలర్ రిలీజ్..!

గన్నవరం పట్టణానికి చెందిన యువకుడు జె.సుభాష్ హీరో గా నటించిన చిత్రం కాస్ట్ లీ కోరికలు చిత్ర ట్రైలర్ ను ఆదివారం మధ్యాహ్నం చిత్ర బృందం విడుదల చేశారు. ఎస్.వి.వి. సాయి కుమార్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.వి.ఝాన్సి లక్ష్మి నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ ప్రేక్షకులకి అంచనాలు పెరిగేలా చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంది.సందీప్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Leave a Comment