కలికిరి, మార్చి 29(జానం న్యూస్): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలికిరి పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకలను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షాబుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, 44 వసంతాల సందర్బంగా ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి నాయకులు ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందం పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జంగమ కార్పొరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు చేత “తెలుగువారి ఆత్మగౌరవం” నినాదంతో స్థాపించబడింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా, హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది. స్థాపించిన 9 నెలల్లోనే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో మరింతగా విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి, డైరెక్టర్లు శ్రీనివాస్ వర్మ, రాంబాబు, టిడిపి మండల మాజీ అధ్యక్షులు నిజాముద్దీన్, టిడిపి మండల ఉపాధ్యక్షులు రెడ్డప్ప రెడ్డి, పట్టణ యువ నాయకులు యోగేష్ రెడ్డి, దినకర్, మండల మైనార్టీ అధ్యక్షులు మున్వర్ అలీ, గుండ్లూరు సర్పంచ్ సైఫుల్ల, మర్రికుంటపల్లి సర్పంచ్ రెడ్డి రామ్, మహల్ మాజీ సర్పంచ్ సతీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జనార్దన్ గౌడ్, నాయకులు సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు

