పీలేరు సెప్టెంబర్ 17:సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో భాగంగా పీలేరు పట్టణంలో మంగళవారం ఈఓ గురు మోహన్ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు.పై ర్యాలీలో ఎన్.సి.సి, విద్యార్థులు, మండల ఆధికారులు, సామాజిక సంస్థలు, వెలుగు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు చేత ఈవో గురు మోహన్ ‘స్వచ్ఛత హి సేవ’ లక్ష్యాలను సాధిస్తాం అని ప్రతిజ్ఞ చేపించారు.

ఈ సందర్భంగా ఈవో గురు మోహన్ మాట్లాడుతూ
‘స్వచ్ త హీ సేవా’ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రజలలో శుభ్రత పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు.

‘స్వచ్ త హి సేవా’ ముఖ్య లక్ష్యాలు:
1. కచ్చితమైన శుభ్రతను ప్రోత్సహించడం.
2. మురికి, చెత్తను తొలగించడం.
3. పర్యావరణ పరిరక్షణకు సహకరించటం.
4. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చైతన్యం కల్పించడం.
5. జనం తమ సమాజానికి సేవ చేయడంలో భాగస్వామ్యం అవ్వడం.అనంతరం పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పై కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతమ్మ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజీ నటరాజన్, ఎన్.సి.సి అధికారులు మురళి(ప్రభుత్వ ఉన్నత పాఠశాల), జయపాల్ రెడ్డి(జడ్పీ ఉన్నత ప్రధాన పాఠశాల), వెంకటరమణ(కోటపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల), పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపల్లి బాబు రెడ్డి, పురం రామ్మూర్తి, అమర్నాథరెడ్డి, పోలిశెట్టి సూరి, తదితరులు పాల్గొన్నారు.

