Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

గండబోయినపల్లిలో ఆనందోత్సవాల మధ్య నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు.

జానం న్యూస్,
(పీలేరు), సెప్టెంబర్ 13:
పీలేరు నియోజకవర్గంలో నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు వాడవాడలా ఆనందోత్సవాల మధ్య, అభిమానులు కేరింతలు, టపాసాల మోతలు మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో భాగంగా నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలం, గండబోయినపల్లి లో రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కలికిరి ధరణి హోటల్ యజమాని, నల్లారి బ్రదర్స్ వీరాభిమాని పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో అన్నదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామ దేవత శ్రీ సత్యమ్మ ఆలయంలో నల్లారి బ్రదర్స్ పేరట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టిడిపి కార్యాలయంలో భారీ కేకును కట్ చేసి అభిమానులకు ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి(సత్య రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చిన నల్లారి సోదరులకు మేము సగర్వంగా గుర్తించి, సంబరాలు చేసుకుంటున్నాము. వారు ప్రగతి సారధులు, అభివృద్ధి జ్యోతులు మరియు నాయకత్వ స్వరూపులు.అభివృద్ధి మరియు శ్రేయస్సు వారి మార్గదర్శక శక్తిగా నల్లారి సోదరులు కేవలం నాయకులు మాత్రమే కాదు, పురోగతి యొక్క యోధులు, పీలేరు ను అభివృద్ధి మరియు ఆవిష్కరణల నమూనాగా మార్చాలనే నిబద్ధతతో నిర్భయంగా ముందుకు సాగుతున్నారు.వారి అంకితభావం అసమానమైనది మరియు వారి ప్రయత్నాలు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆదర్శప్రాయమైన నాయకులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కార్యకర్తలు, నల్లారి అభిమానులు, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, గండ బోయినపల్లి గ్రామస్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.

Socal Share

Related posts

ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యం:కుప్పం రవిచంద్రా రెడ్డి,నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ యజమాని.

Dr. Gangi Reddy Janam Chief Editor-

కలికిరి పట్టణం లో నూతన ధరణి హోటల్ ను ప్రారంభించిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

చింతలబైలు గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు, దుప్పట్లు పంపిణీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment