Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

రాజకీయ పార్టీ దిశగా యానాది సంఘాల మహాకూటమి…

జానం న్యూస్, పీలేరు, మార్చి 26: రాజకీయ పార్టీ దిశగా యానాది సంఘాల మహాకూటమి ఏర్పడుతుందని మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మరియు గౌరవాధ్యక్షులు జానం గంగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి నగర్ లోని ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్ నందు గిరిజన యానాది మేల్కొలుపు సభ జరిగింది. పై సమావేశానికి “గిరిజన యానాది సంఘాల మహాకూటమి” రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి, ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి, దీనావస్థలో జీవిస్తున్నది గిరిజన యానాది జాతి అని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన యానాది బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో యానాదులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజకీయ సాధికారత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ చట్టసభలలో యానాదులు పక్షాన మాట్లాడే గొంతుకు లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి తమ జాతిని తామే ముందుకు నడిపించే బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలోని 28 గిరిజన యానాది సంఘాలు కలిసి మహాకూటమిగా ఏర్పడిందని అన్నారు. భవిష్యత్తులో యానాది సంఘాల మహాకూటమి రాజకీయ పార్టీగా అవతరించబోతుందని తెలిపారు.అనంతరం యానాది సంఘాల మహాకూటమి అన్నమయ్య జిల్లా శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అన్నమయ్య జిల్లా  చైర్మన్ గా గడ్డం శ్రీనివాసులు, అధ్యక్షులుగా కుప్పం రాజేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శిగా గాలేటి వెంకటేశ్వర, కోశాధికారిగా గానుగపెంట సిద్దు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నచ్చుకూరి రెడ్డప్ప, జాయింట్ సెక్రటరీగా ముత్యం తిరుపాల్, కార్యదర్శిగా నగిరిపాటి వెంకటేష్,గౌరవాధ్యక్షులు మరియు మీడియా సమన్వయకర్తగా జానం గంగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పై కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన యానాది సంఘం నాయకులు డాక్టర్ వెంకటరమణ, నారాయణమ్మ, టేకుమంద రెడ్డప్ప, పాపయ్య, నిమ్మనపల్లి రెడ్డప్ప, సోమల గంగులప్ప, ఆదినారాయణ, మహాకూటమి రాష్ట్ర నాయకులు పలమార గోపి, చలంచర్ల ప్రసాద్, ఇండ్ల వెంకట సుబ్బారావు,పారాల పరమేశం వ్యాప్తంగా గిరిజన యానాది నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తున్న గిరిజన యానాది నాయకులు
ప్రసంగిస్తున్న యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి
ప్రసంగిస్తున్న ఏపిజివైఎస్ఎస్ చిత్తూరు జిల్లా నాయకులు డాక్టర్ వెంకటరమణ
ప్రసంగిస్తున్న గిరిజన యానాది నాయకుడు టేకుమంద రెడ్డప్ప
ప్రసంగిస్తున్న యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమాల గోపి
ప్రసంగిస్తున్న ఏపీజీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అన్నమయ్య జిల్లా నూతన యానాది సంఘాల మహాకూటమి నాయకులు మాట్లాడుతూ తమకు ఈ పదవులు మరింత బాధ్యత పెంచాయని యానాది జాతి సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

Socal Share

Related posts

Ruby Jubilee Celebrations at APRS Gyarampalli.

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాల్మీకిపురం 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం – మధుర జ్ఞాపకాల మధ్య షష్టిపూర్తి వేడుక

Dr. Gangi Reddy Janam Chief Editor-

గ్రంధాలయలను ఆధునికరిస్తాం:జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ఎన్. మధుబాల.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment