వైసీపీ ప్రభుత్వం లో పీలేరు మండలం అన్ని విధాల అభివృద్ధి చెందిందని పీలేరు మండల వైసిపి కన్వీనర్ దండు జగన్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ (షామియానా షఫీ) అన్నారు. మంగళవారం పీలేరు పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహకారంతో పీలేరు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు.
జానం న్యూస్, పీలేరు, మార్చి 5:వైసీపీ ప్రభుత్వం లో పీలేరు మండలం అన్ని విధాల అభివృద్ధి చెందిందని పీలేరు మండల వైసిపి కన్వీనర్ దండు జగన్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ (షామియానా షఫీ) అన్నారు. మంగళవారం పీలేరు పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహకారంతో పీలేరు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. నాలుగు లైన్ల బైపాస్ రోడ్డు తోపాటు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. డంపింగ్ యార్డ్ నిర్మాణం, ఎక్కడా లేని విధంగా ఒక్క పీలేరు మండలంలోనే 12 వేల మంది లబ్ధిదారులకు కుల, మత, రాజకీయరహితంగా జగనన్న కాలనీలో ఇల్లు కేటాయించడం జరిగింది. వివిధ చికిత్సలకు దూర ప్రాంతాలకు వెళుతున్న పీలేరు ప్రాంత ప్రజలకు అందుబాటులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగింది. “నాడు-నేడు” పనులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దారని అన్నారు.పేద విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని నూతన సాంకేతికను జోడించి ఇంటర్ ఆక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డ్స్ ద్వారా బోధించి నాణ్యమైన విద్య అందిస్తున్నారు. విద్యా దీవెన, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, వసతి దీవెన తదితర పథకాలు ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు జగన్ మామయ్య అయ్యాడు. మరుగునపడ్డ గ్రామ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల కోసం బటన్ నొక్కి వారి ఖాతాలో నగదువేసి వారి కళ్ళల్లో ఆనందం చూశారు. ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి తన సొంత నిధులతో మండలంలోని ఎన్నో గ్రామాలలో దేవాలయాలు, ఆర్ఓ ప్లాంట్లు నిర్మించారని అన్నారు. వారిచ్చిన మాటకు కట్టుబడి శ్రీమతి జీనత్ షఫీ కి సర్పంచ్ పదవికి అవకాశం ఇచ్చారని అన్నారు. జీనత్ షఫీ తన భర్త షేక్ షఫీ, కుమారుడు షేక్ జావీద్ సహకారంతో పీలేరు పంచాయతీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాబట్టి ఏప్రిల్ నెలలో జరుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.


