పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సామర్థ్యం భేష్ అని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రామకృష్ణ అన్నారు.లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (అభ్యసనాభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా విద్యాశాఖ రాష్ట్ర పరిశీలక బృందం డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలో బృంద సభ్యులు కే.రాజేంద్ర ప్రసాద్(గణితం పరిశీలికులు), జి.సి నాగప్ప (తెలుగు పరిశీలకులు),డి.బాబా సాహెబ్(సోషల్ పరిశీలకులు) శుక్రవారం పీలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.వీరు 6,7,8వ తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు, విద్యార్థుల కనీస పఠనా సామర్థ్యం, ఉపాధ్యాయుల బోధనా అంశాలు, భాషా నైపుణ్యం రికార్డులను పరిశీలించారు.

జానం న్యూస్, పీలేరు, ఫిబ్రవరి 23:పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సామర్థ్యం భేష్ అని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రామకృష్ణ అన్నారు.లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (అభ్యసనాభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా విద్యాశాఖ రాష్ట్ర పరిశీలక బృందం డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలో బృంద సభ్యులు కే.రాజేంద్ర ప్రసాద్(గణితం పరిశీలికులు), జి.సి నాగప్ప (తెలుగు పరిశీలకులు),డి.బాబా సాహెబ్(సోషల్ పరిశీలకులు) శుక్రవారం పీలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.వీరు 6,7,8వ తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు, విద్యార్థుల కనీస పఠనా సామర్థ్యం, ఉపాధ్యాయుల బోధనా అంశాలు, భాషా నైపుణ్యం రికార్డులను పరిశీలించారు. పరిశీలన అనంతరం రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ఎస్.రామకృష్ణ పాఠశాల బోధన సిబ్బంది సమావేశంలో మాట్లాడుతూ తమ పరిశీలనతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, చురుకుదనం సంతృప్తికరంగా ఉందని కితాభిచ్చారు. తరగతి గదిలో వెనుక
బడిన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేపట్టాల్సిన బోధన, కార్యాచరణ ప్రణాళిక గురించి రివ్యూ మీటింగ్లో వివరించారు. విద్యార్థులకు సహా పాఠ్యాంశాలైన నైతిక విలువలు, పచ్చదనం పరిశుభ్రత, డ్రాయింగ్, పెయింటింగ్, చేతివ్రత తదితర అంశాలలో తర్ఫీదు ఇవ్వాలని అన్నారు. ఇంకా బోధనా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. చివరగా పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్ర పరిశీలక బృందానికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పై కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.జి నటరాజ, ఎంఈఓ లోకేశ్వర్ రెడ్డి, ఎంఈఓ-2 పద్మావతమ్మ, సి.ఆర్.పి మురళీధర్ రాజు, పాఠశాల బోధన సిబ్బంది ఆర్.శిరీష(గణితం),సి.శశిదేవి(తెలుగు), ముని వెంకట్రామయ్య(సాంఘిక శాస్త్రం), డీ.లీలావతి(సాంఘిక శాస్త్రం), ఎస్.మోదీన్ భాష(ఇంగ్లీష్),వై.రమణారెడ్డి(ఇంగ్లీష్), పి.షరీఫ్ ఉన్నిసా(హిందీ), బి.రాజన్న(తెలుగు), సురేష్ రెడ్డి(భౌతిక శాస్త్రం), వి.జనార్దన్ రెడ్డి(జీవ శాస్త్రం), బి.మురళి(జీవ శాస్త్రం), వి.నాగవేణి(తెలుగు), విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

