Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలు

రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ విజేత టి.హోత్రి శ్రీ

జానం న్యూస్, పీలేరు, జనవరి 7: అనంతపురం జేఎన్టీయూ  సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం నుండి శనివారం వరకు జరిగిన 26వ ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్, గేమ్స్ మీట్ లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆరు క్రీడలలో పోటీలు జరిగాయి. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో సింగిల్స్ మరియు  డబుల్స్ లో పీలేరు కు చెందిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హోత్రి శ్రీ అంగల్లు, గోల్డెన్ వాలీ పాలిటెక్నిక్ కళాశాల తరఫున ఆడి విజేతగా నిలిచింది. మార్చిలో జరిగే సౌత్ జోన్ క్రీడలకు ఎంపికైంది. తిరుపతి సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ, అనంతపురం జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ జయ చంద్రారెడ్డి చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం పీలేరు హోత్రి శ్రీ అకాడమీలో  టి.హోత్రి శ్రీ కి శాలువా కప్పి ఘన సన్మానం చేయడం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పట్టణ ప్రముఖులు రేఖరాణి స్వరాజ్ రెడ్డి దంపతులు, సీనియర్ క్రీడాకారులు రాచపల్లి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థులకు కూడా క్రీడలు అవసరమేనని అన్నారు. తన కూతురు కూతురు హాత్రి శ్రీ బ్యాడ్మింటన్ లో రాణించేందుకు టీ.ప్రభాకర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. హోత్రి శ్రీ పీవీ సింధు అంతటి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.జాతీయ క్రీడాకారుడు మరియు కోచ్ టీ.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె హోత్రి శ్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలంటే ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. పై కార్యక్రమంలో హోత్రి శ్రీ బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు హనీఫ్, వేణుగోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, రెడ్డి వారది, ముని ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాల్మీకిపురం పశువైద్యశాల ఏడి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రకృతికి ప్రతిఫలంగా ‘ఓ మొక్క – ఓ అమ్మ పేరు’ ఉద్యమం: పీలేరు VSN సిద్ధార్థ టెక్నో స్కూల్‌లో ఉత్సాహభరితంగా ‘ఏక్ పేడ్ మాకే నాం’ కార్యక్రమం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment