జానం న్యూస్, కలికిరి, నవంబర్ 24:ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలబడ్డ తెలుగు బిడ్డ మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. అన్నమయ్య జిల్లా, కలికిరి పట్టణం, ధరణి హోటల్ ఆవరణలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 217 వ జయంతి వేడుకలు రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి@సత్యారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేకు కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. జై రెడ్డి – జై జై రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం వర్ధిల్లాలి, జోహార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ 1846 సంవత్సరంలో మొదటి స్వాతంత్ర యుద్ధం మొదలు కాక 10 సంవత్సరాలకు ముందే బ్రిటిష్ వారిపై సమర శంఖం పూరించి తెలుగువారి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచి చూపిన మహా యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. అప్పట్లో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి ఆంగ్లేయుల దాస్టికాలను చీల్చి చెండాడి వీర మరణం పొందిన ధీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. మూడు నెలలు ఆంగ్లేయులపై గేరెల్లా పోరాటం చేసి వేలాదిమంది ఆంగ్లేయులను మట్టుపెట్టిన రేనాటి సూర్యుడు అని అన్నారు. అందుకే ఆయన గాధను ఇప్పటికీ తెలుగు వారు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని అన్నారు. ఆయన మరణించినా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంటాడని అన్నారు. 2017 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని ప్రథమ స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తించి ఆయన చిత్రం కలిగిన పోస్టల్ స్టాంపు కూడా ముద్రించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాంప్రసాద్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, శేష కుమార్ రెడ్డి, శేషాద్రిరెడ్డి, కే.రెడ్డెప్పరెడ్డి, చంద్రారెడ్డి,
వెంకటరమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, తాతి రెడ్డి, జయరాం రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్, సుధాకర్ రెడ్డి, రాజారెడ్డి, ప్రభాకర రెడ్డి,జి.జనార్ధన రెడ్డి, అమరనాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



