Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

కలికిరి పట్టణంలో అధునాతన సాంకేతికతతో నూతనంగా SPS హాస్పిటల్ ప్రారంభం.

జానం న్యూస్, కలికిరి, నవంబర్ 16: స్థానిక పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపున నల్లారి క్రిష్ణా రెడ్డి నగర్ లో డాక్టర్ షేక్ మహమ్మద్ వషీమ్,డాక్టర్ షేక్ సిమ్రాన్ ల ఆధ్వర్యంలో ఇటీవల అధునాతన సాంకేతికతతో నూతనంగా ఎస్.పి.ఎస్ హాస్పిటల్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహమ్మద్ హుస్సేన పేదలకు ఉచిత సేవలను ఎంపీ ప్రశంసించారు. ఎస్.పి.ఎస్ హాస్పిటల్ నందు ప్రతి బుధవారం రోజు దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్,బీపీ వ్యాధులకు అన్ని వర్గాల వారికి ఓపితో పాటు షుగర్ టెస్టులను ఉచితంగా చేయడంతో పాటు టిఫిన్ అందిస్తున్నట్లు డాక్టర్ షేక్ మహమ్మద్ వషీమ్,డాక్టర్ షేక్.సిమ్రాన్ తెలిపారు.  అదేవిధంగా _60సంవత్సరాల పైబడిన వృద్ధులకు ప్రతి రోజు ఉచిత వైద్య సేవలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు ఓపి 50రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు._ 24గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ పిఎస్ హాస్పిటల్ నందు కార్పొరేట్ వైద్యం మరియు అత్యాధునిక ల్యాబ్ 24 గంటల సౌకర్యం, మందులు అతి తక్కువ ధరలతో అందరికీ అందుబాటులో ఉండేలా 24గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కలికిరి లో అవసరమైన వారికి ఇంటివద్దకే వచ్చి వైద్య సహాయంతో పాటు రక్త పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8897228088 లేదా ల్యాండ్ ఫోన్ నెంబర్ 08586 796569 లకు సంప్రదించాలని వారు కోరారు.

Socal Share

Related posts

వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఆంగ్లేయుల గుండెల్లో సింహ స్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment