జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 18: అన్నమయ్య జిల్లా,
పీలేరు నియోజకవర్గం కే.వీ. పల్లి మండల కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 6వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు సబ్ జూనియర్ విభాగంలో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలలో 22 జిల్లాల నుండి 18 బాలుర జట్లు, 12 బాలికల జట్లు, సుమారు 450 క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడాకారులు చేసిన పాస్ట్ మార్చ్ అందరినీ అలరించింది. క్రీడాకారులను నిర్వాహకులు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవి రమణకు పరిచయం చేశారు.
పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి సభ్యులు గజ్జల శృతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అని ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జిల్లాల్లో షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు.
మండల విద్యాశాఖ అధికారి పి.రెడ్డి భాషా మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు తమ పాఠశాలలో నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు.
జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవి రమణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ పరుశురాముడు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ షూటింగ్ బాల్ క్రీడా 45 సంవత్సరాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిందని మొదటి జాతీయ స్థాయి పోటీలు 1976 ఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగినట్టు తెలిపారు.షూటింగ్ బాల్ క్రీడ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతు సహకారం అందించాలని కోరారు. క్రీడలకు మైదానం కేటాయించి, క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవి రమణకు, పాటశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల యూత్ కన్వీనర్ గజ్జల శీను రెడ్డి, గర్నిమిట్ట సర్పంచ్ రమణమ్మ, ఉమ్మడి జిల్లాల షూటింగ్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ నరేష్ బాబు, అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి, తిరుపతి జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి వనిత ,చిత్తూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్ , టోర్నమెంట్ డైరెక్టర్ నాగరాజు, టెక్నికల్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, యూసఫ్ భాష, పరమేశ్వర్ రెడ్డి, దేవేంద్ర, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ జుబేర్ పోటీల నిర్వాహకుడు నాగరాజ, మురళి తదితరులు పాల్గొన్నారు.



