Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 17: మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గంజాయి, ఖైనీ, గుట్కా, సారా వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మాదకద్రవ్యాల వినియోగంతో విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు మీ గ్రామాల్లో తోటి వారికి వివరించాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి బాగా చదువుకోవాలని, ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందాలని కోరారు
రోడ్డు నియమ నిబంధలనపై మాట్లాడుతూ  రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అతివేగం, ఓవర్ లోడ్, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ శాతం  ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి వాహనదారులు వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను కలిగిఉండాలని చెప్పారు. మైనర్ బాలలకు వాహనాలను ఇవ్వొద్దని తెలిపారు. రోడ్డు నియమ నిభందనలపై అవగాహన కలిగి ఉన్నట్లయితే ప్రమాదాలను నియంత్రించవచ్చని చెప్పారు. రాయచోటి డి.ఎస్.పి మహబూబ్ బాషా  మాదకద్రవ్యాల వాడకంపై దుష్పలితాలు, రోడ్డు ప్రమాదాలపై విపులంగా వివరించారు. పై కార్యక్రమంలో తెలుగు భాష అభివృద్ధి ఉద్యమకారుడు మురళీధర్ రాజు, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ప్రసంగిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు

సదస్సులో మాట్లాడుతున్న పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి
Socal Share

Related posts

జేఎన్‌టీయూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి –JNTUA వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు

Dr. Gangi Reddy Janam Chief Editor-

తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment